నిశిత పరిశీలన;- -గద్వాల సోమన్న,9966414580
తరువులు గనుక లేకుంటే
ప్రాణ వాయువు దొరికేనా!
గురువులు భువిని లేకుంటే
అజ్ఞానం అంతమయ్యేనా!

అన్నదాతలే లేకుంటే
ఆకలి కేకలు తీరేనా!
సూర్యచంద్రులే లేకుంటే
అంధకారం తొలగేనా!

అమ్మానాన్నలు లేకుంటే
మానవ జన్మ ఉండేనా!
ప్రాణ స్నేహితులు లేకుంటే
స్నేహం విలువ తెలిసేనా!

భగవంతుడే లేకుంటే
సృష్టి క్రమంగా సాగేనా!
పంచభూతాలు లేకుంటే
మనిషి మనుగడ నిలిసేనా!


కామెంట్‌లు