చిలుకమ్మ పలుకులు;- -గద్వాల సోమన్న,9966414580
గుండెలోని కలతలు
పిండి చేయు బ్రతుకులు
ఆదిలో త్రుంచాలి
శీఘ్రమే తరమాలి

నీచమైన గుణములు
పాడు చేయు మనసులు
దిద్దుకున్న మంచిది
బాగుపడును బ్రతుకులు

ఇంటిలోన మహిళలు
వెలుగులీను ప్రమిదలు
వారుంటే కళకళ
వారు లేక వెలవెల

వనంలోని సుమములు
ముఖములోని నగవులు
అందాలే రువ్వును
ఆరోగ్యము పంచును

కామెంట్‌లు
Popular posts