సత్సంబంధాలు అనివార్యం;- -గద్వాల సోమన్న,9966414580
అద్దాల మేడలో ఉన్నా
అందాల  వాడలో ఉన్నా
మనశ్శాంతి దూరమైతే
ఒకటే కదా ఎక్కడున్నా

బంధాలు విచ్చిన్న మైనా
అనుబంధాలు విడిపోయినా
ఏకాకి కావాల్సిందే
మంచి మిత్రుని కోల్పోయినా

సిరి సంపదలు ఎంత ఉన్నా
అధికారమే కల్గియున్నా
"నా" అనే వారు లేకపోతే
గుండు సున్న ఎన్ని ఉన్నా

ఖరీదైన కార్లో తిరిగినా
విలాసాల బార్లో గడిపినా
మనసు గనుక ముక్కలైతే
శూన్యమే స్వర్గంలో ఉన్నా

బంధాలన్నీ బాగుండాలి
అందరి క్షేమం కాంక్షించాలి
జగదైక కుటుంబమై మనం
విశ్వశాంతికి పాటుపడాలి


కామెంట్‌లు