ఎంతో మంచిది;- -గద్వాల సోమన్న,9966414580
మాటల్లో మితము
చేతల్లో అమితము
ఉంటేనే మంచిది
తెచ్చిపెట్టును యశము

పెద్దలపై గౌరవము
తెలుగుపై అభిమానము
ఉంటేనే మంచిది
బ్రతుకులో క్షమాగుణము

ఆపదలో సాయము
అందరికీ న్యాయము
జరిగితేనే మంచిది
బాలికల సంక్షేమము

రైతన్నల క్షేమము
ప్రతిరోజూ ధ్యానము
చేస్తేనే మంచిది
ఇల విద్యాదానము

కామెంట్‌లు