బాలాంత్రపు రజనీకాంతరావు; కొప్పరపు తాయారు
 బాలాంత్రపు రజనీకాంతరావు (1920 జనవరి 29 - 2018 ఏప్రిల్ 22) బహుముఖ ప్రఙ్ఞాశాలి. వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు.
బాలాంత్రపు రజనీకాంతరావు
ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచానఎఫ్.ఎంర , ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం.
ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం , జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్తులో ఉంది.

కామెంట్‌లు