వింతలు విశేషాలు! సేకరణ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 మనలో చాలా మంది ట్రెజర్ ఐలాండ్ అనే ఆంగ్ల పుస్తకం నాన్డిటేల్ గా చదివే ఉంటారు.దాన్ని రాసిన వాడు రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత.ఆకథకి ఆధారం ఓ సముద్రపుదొంగ నిజగాథ.కోస్టారికా లో. కోకోస్ఐలాండ్ అనే ద్వీపంలో ఆ సంపద దాచబడింది.1823 లోధనవంతులైన స్పానిష్ కుటుంబాలు లీమా నుంచి పారిపోయాయి.పొరుగు రాజ్యం దాడి చేస్తుంది అనే భయంతో మేరీ డియర్ అనే ఓడలో తలదాచుకున్నారు.దానికెప్టెన్ విలియం థాంప్సన్.అతనే గొప్ప సముద్రపుదొంగ గా మారాడు.ఓడరేవు నించి చాలా దూరం వెళ్ళాక తన తోటి వారి తో కల్సి థాంప్సన్ ఆస్పానిష్ ధనిక యాత్రికులను చంపి ఆ సంపదను కోకోస్ ఐలాండ్ అనే ద్వీపంలో ఓగుహలో దాచాడు.థాంప్సన్ అనుచరులు కొన్నాళ్ళకి పట్టుబడి ఉరితీయబడ్డారు.కానీ థాంప్సన్ తప్పించుకున్నాడు.తన సంపద దాచిన గుహకి చాలా దూరం వెళ్ళిపోయాడు.అందుకే ఇంకా కోకోస్ఐలాండ్ లో ఆసంపద ఉంది అనే జనం నమ్మకం.దీన్ని లీమా ట్రెజర్ అంటారు.
కామెంట్‌లు