భూగోళం .... కోరాడ నరసింహా రావు!

 నాల్గు భూతముల శక్తులనూ
  తనలో దాచు కునీ... 
 ఐదవశక్తిగ అవతరించిన
 అద్భుత శక్తి స్వరూపమే... 
 మన ముండే ఈ  భూ గోలం! 
 ఇది మహా శక్తి స్వరూప0.. సకల ప్రాణి కోటినీ కని, పెంచే తల్లి ఈ ధరిత్రి  ... ! 
 సృష్టి లో మరెక్కడా  కానరాని దీ వైచిత్రి...!! 
సకల సంపదల నందించి
  సుఖమగు బ్రతుకుల నిచ్చి
 తన ఒడి లో లాలించును ఈ భూమాత... 
 అతిగా సుఖముల నాసించి
 ఒనరుల విద్వ0శ0 చేసి
 కాలుష్యములనె పెంచి
  ఈ స్వర్గమును , నరకముగా
 మార్చొద్దు...! 
  సుధలాలికించు ఈ వసుధను గరళ భా0డముచెయ్యొద్దు!! 
 స్వచ్ఛ మైన  నీటిని ,గాలినిధ్వంశ0 చేసి... 
 బావి తరాలను బలి చెయ్యొద్దు...! 
 మీ పాపాల భూగోళాన్ని 
 మీ వారసులకు అందివ్వద్దు
       *******

కామెంట్‌లు