కళింగాంధ్రలో తిరుమలరావు కవిత.
 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు రచించిన కవిత, కళింగాంధ్ర గ్రంథంలో స్థానం పొందింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంధాలయం సమావేశ మందిరంలో జరిగిన కళింగాంధ్ర గ్రంథం ఆవిష్కరణ సభలో తిరుమలరావును సన్మానించారు. ఈ వేమన కవితాలయం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహమ్మద్ రఫీ ఈ వేమన, తపస్వీ మనోహరం సహాయం సంపాదకులు బలివాడ తేజస్వినిల ఆధ్వర్యంలో, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర పుస్తకావిష్కరణ అనంతరం తిరుమలరావును అభినందించి సన్మానించారు. ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథిగా విచ్చేసిన 
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు, విశ్రాంత సీ.ఈ.ఓ. సురంగి మోహనరావులు ఈ కళింగాంధ్రను ఆవిష్కరించారు.
ఈ వేదికపై తిరుమలరావు తన కవితాగానం చేసి అందరి ప్రశంసలు పొందారు. 
అనంతరం తిరుమలరావును నిర్వాహకులు, అతిథులు, కవి సమ్మేళనం సమన్వయకర్తలు ఘనంగా సన్మానించారు. 
తిరుమలరావు సత్కారం పొందుటపట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు