జయజయజయహో రామయ్య (గేయం )- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 దశరథ పుత్రుడు రామయ్య 
దారిని జూపెను రామయ్య 
వినయవంతుడై రామయ్య 
విద్యలు నేర్చెను రామయ్య 
పెద్ద  విల్లునట రామయ్య 
ఫెళ్ళున విరిచెను రామయ్య 
సీతను పెండ్లాడి రామయ్య 
శ్రీమంతుడాయెను రామయ్య 
వనముల కేగెను రామయ్య 
వారధి కట్టెను రామయ్య 
లంకను జేరెను రామయ్య 
రక్కసుల జంపెను రామయ్య 
సీతను తెచ్చెను రామయ్య 
సిరులను పంచెను రామయ్య 
జగతిని పాలించె రామయ్య 
జయ జయ జయహో రామయ్య //

కామెంట్‌లు