శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
596)అనివర్తీ -

ధర్మమార్గములో పయనించువాడు 
వెనుకకు మరలనట్టివాడు 
తలపులప్రకారమే నడుచువాడు 
అనివర్తియై సాగుతున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
597)నివృత్తాత్మా -

నియమముతో సంచరించువాడు 
ఆత్మ నియంత్రణమున్నవాడు 
నిగ్రహమునీయగలిగినవాడు 
ఆత్మ సంవృత్తినిచ్చునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
598)సంక్షేప్తా -

జగత్తును సూక్ష్మము గావించువాడు 
స్వల్పరూపముగా చేయగలవాడు 
ప్రళయమందు రక్షణజేయువాడు 
సంక్షేమపు సంకల్పమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
599)క్షేమకృత్ -

క్షేమమును సమకూర్చునట్టివాడు 
శుభములకారణమైన వాడు 
సంతోషమును కలిగించగలవాడు 
క్షేమయోగకారణమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
600)శివః -

వేదముగా భాసిల్లుచున్నవాడు 
మోక్షమును ప్రసాదించువాడు 
శుభయోగములు కలిగించువాడు 
స్మరణతో పవిత్రము చేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు