626)అనీశః -
తనకు ప్రభువులేనట్టివాడు
నియామకుడు లేకుండినవాడు
తనకుతనే ఈశ్వరుడైనవాడు
ఆదిదేవునిగా యుండినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
627)శాశ్వత స్థిరః -
శాశ్వతంగా నిలిచియున్నవాడు
నిరూపించుచున్నట్టి వాడు
స్థిరమైన మార్గమును చూపువాడు
భక్తులకు శాశ్వతుడైయున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
628)భూశయః -
భూమిపై శయనించుచున్న వాడు
ఇటుకమీదనున్న పాండురంగడు
ధరణిని అంటియున్నట్టివాడు
భూశయనముకూడా చేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
629)భూషణః -
తనకు తానే నగయైనట్టివాడు
స్వయం భూషణములున్నవాడు
ధర్మాభరణము దాల్చినవాడు
సత్యభూషణుడై రాజిల్లువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
630)భూతిః -
సర్వ ఐశ్వర్యములు గలవాడు
సంపదలను పొందినవాడు
సత్తాను కలిగియున్నట్టివాడు
భస్మముదాల్చియున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి