శ్యామశాస్త్రి గారు ;- కొప్పరపు తాయారు.
 శ్యామశాస్త్రి గారు దక్షిణాత్య కర్ణాటక సంగీతరత్న త్రయం లో ఒకరు. 
       ముగ్గురు ముమ్మర్తుల సంగీతానికి ప్రతిరూపాలు ఈయన మూడవ వారు 
    ఈయన పుట్టినది   కర్నూలు జిల్లాలోని ఖమ్మంలో 
జన్మం :ఏప్రిల్ 26, 1763 
ఫిబ్రవరి 6, 1827. 
          ఈయన ప్రసిద్ధులు సంగీత కళాకారులు వాగ్గేయకారులు. ఈ వాగ్గేయకారులు ముగ్గురు.
ముగ్గురిలో వీరు ఒకరు త్యాగరాజు గారు ముత్తుస్వామి దీక్షితులు గారు, శ్యామశాస్త్రి గారు. 
             వీరి తల్లిదండ్రులు కర్నూలు జిల్లాలోని ఖమ్మంలో ఉండేవారట. మహమ్మదీయుల దండయాత్రలకు బెదిరి కంచి చేరుకున్నారు .అక్కడా
గొడవల వల్ల శ్రీపురమను తిరువారూరి క్షేత్రమునకు 
రావడం అయినది.వీరు అత్యంత శ్రీమంతులు.
         కామాక్షి అమ్మని విపరీతమైన భక్తితో ధ్యానించడం వలన, ఆ వ్రతాలు చేస్తున్నప్పుడు, వెంకటా చలపతి ఒకరి మీద ఆదేశించి ఒక సంవత్సరంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పారు . చెప్పినట్టే 1763 లో చిత్రభాను సంవత్సరంలో శ్యామశాస్త్రిగారుజన్మించారు.ఈయన గొప్ప వైణికుడు కూడా.

కామెంట్‌లు