జీ వి యం సి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం
 జీ వి యం సి ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో శుక్రవారం  అంత్యంత వేడుకగా పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పిల్లలు కోలాటాలు, ఉగాది సంబరాలు, బాలల కవి సమ్మేళనాలు, జానపద నృత్యాలు, ఏకపాత్ర అభినయాలు, త్యాగరాజ,అన్నమయ్య కీర్తనలు కూచిపూడి నృత్యాలు ఇలా వినూత్నంగా అద్భుతంగా సాగింది. ఈ కార్యక్రమానికి GVMC ,సీతమ్మ ధార MEO 2 శ్రీమతి బాలామణి గారు ముఖ్య అతిథి గా విచ్చేసారు. ముగింపు గా అద్భుతమైన ప్రసంగాన్ని విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు శ్రీమతి దుర్గాకుమారి మాట్లాడుతూ  పిల్లలతో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయించిన ఉపాధ్యాయులకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు .MEO గారి కి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి చిరు సత్కారం చేశారు. స్వల్పాహార విందుతో కార్యక్రమం ముగిసింది.

కామెంట్‌లు