కంచి క్షేత్రం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మన భారత దేశం పుణ్య భూమి.అందుకే భూమాదేవి అని అంటారు.స్త్రీస్వరూపం ఐన భారత్ కి కంచి వడ్డాణం అది అమ్మవారి నాభిస్థానం.దక్షిణభారతంలో రెండు మోక్షార్హతపొందిన ప్రాంతాలు కంచి కాశీ.కంచి కామాక్షి అమ్మవారు స్వయంభూవుగా‌వెలిసిన శక్తి పీఠం.అధిష్ఠానదేవత అయ్యప్పస్వామి.ఒకకాలు కిందకి జాపి కూర్చుంటాడు.ఇక్కడి మహామంటపంలో24స్థంభాలు 24 గాయత్రీ బీజాక్షర మంత్రములు.పూలసజ్జ ఆకారంలో ఆదిశంకరులు శ్రీచక్రం ని ప్రతిష్ఠించారు.శివుడు  దుర్వాస మహర్షి కాళిదాసు లలితా భట్టారిక స్తోత్రం చేశారు
 ఇక్కడ సంతానస్థంభం ఉంది.అలాగే ఆవుపాలపెరుగులోని వెన్ననికామాక్షి అమ్మ వారికి నైవేద్యం పెడితే సంతానం కల్గుతుంది.ఇక దుర్వాస మహర్షి కంచి కామాక్షి అమ్మవారిని స్తోత్రం చేశాడు.ఆదిశంకరులు సౌందర్య లహరి లో ఈమెను కొలిచారు.ఇకమనం ముఖ్యం గా చెప్పు కోవలసింది మూకుడు రాసిన మూకపంచశతి.ఆయన అసలు పేరు ఎవరికి తెలీదు.అమ్మవారిని ధ్యానిస్తూ మాటలు రాని ఆయన కామాక్షి గుడిలో నే కూచుని రాశాడు.ఆర్యావృత్తాంతం రచించారు.పాదారవిందశతకం మందస్మిత శతకం కటాక్ష శతకం ఇలా 500 శ్లోకాలు రాశారు ఆయన.మంగళవారం కామాక్షి అమ్మవారి కి తాంబూలం ఇస్తారు.మూకకవి నిశబ్దంగా అమ్మ ని ఆమె పాదాలను చూస్తూ కూచుంటే అమ్మ వారు తన నోట్లో ని తాంబూలం కొంత మూకుని నోట్లో వేసింది.అంతే కవితాధార ఆశువుగా ఆయన నోటి వెంట వచ్చి 500శ్లోకాలరచన గావించారు మూకశంకరులు.అవి రాయడం ఐనాక" అమ్మా! నావాక్కుని ఇంక తీసేయి. అనవసర వ్యర్ధపదాలు మాటలు నేను వాగకుండా చెయ్యి" అని ఆయన ప్రార్థించారు.ఆయన ఓశ్లోకంలో తొలి పదం ఐచ్ఛిషి అంటే నేను చూశాను అని అర్థం.ఇక కంచి పరమాచార్య ఎప్పుడూ ఇలా అనేవారు " నాకు కనకాభిషేకం పూలాభిషేకాలు వద్దు.శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి ప్రవచనం ఇవ్వండి." అందుకే కంచి ఇప్పటికీ మోక్ష సాధనకు సరైన ప్రాంతం గా గుర్తింపు పొందింది సుమా 🌷
కామెంట్‌లు