బ్రహ్మాండంలో ధ్వని! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఏనాడో మన ఋషులు చెప్పారు అంతరిక్షంలో ఓంకారం ధ్వనిస్తుంది అని.మనకి వినపడదు కాబట్టి మనం నమ్మం.కానీతొలిసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు "గురుత్వాకర్షణ తరంగాలు బ్రహ్మాండంలోని ప్రతి దానిలోంచి వెల్తాయని.ఈవేవ్స్ వేగం స్పీడ్ వెలుగు వేగంతో సమానం.2015 లో గురుత్వాకర్షణ తరంగాలు పై పరిశోధనలు విరివిగా జరిగాయి.రెండు బ్లాక్ హోల్స్ ఢీకొంటే ఈతరంగాలు ఉత్పన్నం అవుతాయి అని తేలింది.గ్రావిటేషనల్ వేవ్స్ కారణం గా హమ్మ్ అనే నాదం వస్తోంది.అంతరిక్షంలోఎన్నో చోట్ల గ్యాస్ ఉంది అని దానివల్ల శబ్దం సౌండ్ వస్తోంది అని నాసా పరిశోధన సారాంశం.ప్రపంచంలో వింతలకు కొదవలేదు.స్టోన్ హెంజ్ అనే ప్రాంతం పవిత్ర స్థలం గా ఉన్న రోజులవి.దానికి కారణం కాళ్ళు చేతులు విరిగిన బొమికెలు విరిగినా అక్కడ ఉన్న రాళ్ళకి అతికించే శక్తి ఉంది అని జనం నమ్మారు.నీలిరంగు రాళ్ళు మాజిక్ శక్తి కల్గి శరీరాంగాలని అతికించేవిట.వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంది అని త్వరగా గాయాలు మాన్పుతుంది అని నేడు వైద్య రంగంలో కూడా ప్రయోగిస్తున్నారు కదా? మన ఆయుర్వేదం లో వనమూలికలు మట్టి బంగారం వెండితో భస్మాలు మందులు తయారు చేసే ప్రక్రియలున్నాయి కదూ🌹
కామెంట్‌లు