సనాతన ధర్మం ప్రాశస్త్యం;- : సి.హెచ్.ప్రతాప్
 సనాతన ధర్మం అంటే మానవాళికి నిర్దేశించబడిన ఒక శాశ్వతమైన మార్గం, ఎప్పుడూ ప్రారంభం లేదా అంతం లేని మార్గం, శాశ్వత తత్వశాస్త్రం, సార్వత్రిక సంప్రదాయం, సర్వవ్యాప్తి సత్యం, మరియు ఒక సహజ ప్రవాహం అని శాస్త్రం నిర్వచించింది.
సహనం ,క్షమాపణ ,భక్తి లేదా స్వీయ నియంత్రణ , నిజాయితీ , పవిత్రత , ఇంద్రియాల నియంత్రణ , కారణం , జ్ఞానం మరియు అభ్యాసం , సత్యం మరియు  కోపం లేకపోవడం  అనేవి సనాతన ధర్మంలో పొందుపరచబడిన ముఖ్య అంశాలు.వీటిని ప్రతీ మానవుడు తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రం చెబుతొంది.
.మానవుడు తన జీవితం అనే పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం ముమ్మాటికీ మరువరాదు అని శాస్త్రం హెచ్చరిస్తోంది.. ఆధ్యాత్మికత మేళవించిన టువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగలదు. మనుషులంతా ఒక్కటే అన్నది సనాతన ధర్మం భావాన్ని మదిలో పదిల పరచుకోవదమే కాకుండా దానిని నిత్య జీవితంలో తు చ తప్పక ఆచరించాలి. మన సనాతన ధర్మం కొన్ని జీవిత ప్రమాణాలను మనకు శాస్త్రాల ద్వారా నిర్దేశించింసి. అవి - స్వార్థానికి స్వస్తిపలికి నిస్వార్థజీవిగా బ్రతకాలి. జీవిత పరమార్థం సనాతన ధర్మం కాబట్టి అందుకు నిత్యం కట్టుబడి ఉండాలి. సత్య, ధర్మ, శాంతి ప్రేమలకు అవి దోహదపడగలవు. ధర్మం ఆచరించడంలో అవరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలి. మంచిని పెంచుకోవాలి. మమతానురాగాలు పంచుకోవాలి. దివ్యజ్ఞానం కాంతులు వెదజల్లే సనాతనధర్మం మహనీయులు ఎందరో పాటించారు. కనుకనే వారు మహనీయులు కాగలిగారు. సనాతన ధర్మంతో ముందుకు సాగిపోయేవారికి విజయం వరిస్తుంది.సనాతన ధర్మంలో కర్మ సూత్రం ప్రధానమైనది. మనం చేసే ప్రతి చర్యకు మన జీవితంలో లేదా భవిష్యత్తు జీవితంలో పరిణామాలు ఉంటాయనే ఆలోచనపై ఇది ఆధారపడి ఉంటుంది. మంచి పనులు సానుకూల ఫలితాలకు దారి తీస్తాయి, చెడు పనులు ప్రతికూల పరిణామాలకు దారితీస్తాయి. సానుకూల చర్యలను చేయడం మరియు ప్రతికూల వాటిని నివారించడం ద్వారా, మనకు మరియు మన చుట్టూ ఉన్నవారికి సానుకూల భవిష్యత్తును సృష్టించవచ్చు. ధర్మం అనేది సనాతన ధర్మం యొక్క మరొక ప్రాథమిక సూత్రం. ఇది జీవితంలో ఒకరి విధి లేదా నైతిక బాధ్యతను సూచిస్తుంది. ప్రతి వ్యక్తికి వారి కులం, లింగం, వృత్తి మరియు జీవిత దశ ఆధారంగా ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది. మన ధర్మాన్ని నెరవేర్చడం ద్వారా, మనం గొప్ప మంచికి తోడ్పడతాము మరియు సమాజానికి సమతుల్యత మరియు సామరస్యాన్ని తీసుకువస్తాము
కామెంట్‌లు