నన్ను తెలుసుకో;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గుండెను
తెరుస్తున్నా
లోపలకు
తొంగిచూడు

హృదయాన్ని
ముందుంచుతున్నా
తపనను
తిలకించు

తల
తలుపులుతీస్తున్నా
తలపులను
తెలుసుకో

మనసును
విప్పుతున్నా
భావాలను
గ్రహించు

అధరాలు
ఆడించుతా
వాస్తవాలు
వివరించుతా

ఏమి
చెయ్యమంటావు
ఇంకేమి
చెయ్యమంటావు

ఎలా
ఎరిగించమంటావు
నన్నెలా
తెలుసుకుంటానంటావు

కవిని
కలముపట్టినవాడిని
కైతలని
కుమ్మరించేవాడిని

అక్షరాల
వెనకకువెళ్ళు
పదాల
పరమార్ధమెరుగు

కవితలను
చదువు
కవులను
ఎరుగు

కవిత్వాన్ని
ఆస్వాదించు
సాహిత్యాన్ని
సంరక్షించు


కామెంట్‌లు