ఇల్లాలి చదువు, ... కోరాడ నరసింహా రావు..!
ఇల్లాలి చదువు, ఇంటికీ వెలుగు"
 ఇది ఒకప్పటి మాట..! 
 ఈ రోజుల్లో ఆడ , మగ తేదాలేదు... 
 అందరూ చదువు కుంటున్నారు..! 
 చదువుకుంటే సంస్కారంఅబ్బుతుందనికాదు
 సంపాదనా పరులం కావచ్చని ! 
 ఆర్ధికంగా బలపడితే అణచి వేత లుండవని..!! 
 సమానత్వం సాధించ వచ్చని! 
 చదువు కు అర్ధము... 
 చదువుయొక్క పరమార్ధము ఇది కాదు కదా...! 

మంచి- చెడు లను తెలుసుకుని... చెడును వీడీ
 మంచిని కూడి ఉత్తమ సంస్కా రాలతో ఆనందమయ జీవితాన్ని జీవింప జేసే చదువు యొక్కగొప్ప తనాన్నితెలుసుకుని అధ్యయన దృష్టితో చదువు కునే వారెందరు..!? 

దాని పరమార్దాన్ని పక్కకు నెట్టి
కేవల ధనార్జన కోసమే... 
 ఈ రోజుల్లో ఆ డై నా, మగై నా
  చదివేది..!! 
  శ్రద్ద0తా డబ్బుపైనే.... 
  అందుకే... ఈ చదువులు సుఖమయ ఆనంద జీవితాలనుగాక, ఆ డబ్బుతో వచ్చే అనర్దాలను చవి చూపి ష్తున్నాయి...!! 

నైతిక విలువలను పెంపొందింప జేసే విద్యను
 శ్ర ద్ద తో అభ్యసించాలి ..!
 శ్రద్దావాన్... లభతే జ్ఞానం ! 
 జ్ఞానమే... ఆనందం... 
  ఆనందమే ... మోక్ష0..!! 
ఆ ఇల్లే స్వర్గం..! 
   ********
కామెంట్‌లు