'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 89.
ఉత్పలమాల.
కంటిని నీదు రూపమును కన్నుల కింపుగ దేవళంబునన్ 
వింటిని నీదు లీలలను వీనుల విందుగ తెల్లవార్లు నీ 
బంటుగ గాపుగాసెదను ద్వారము వద్ద సశక్తి యుక్తితో
వెంటచరింతునయ్య!నను బ్రీతిగ గాంచుమ నెమ్మదిన్ హరీ!//
90
ఉత్పలమాల.
చిన్నతనంబుతో మదపు చేష్టలఁ జేసితి మూఢురాలనై
కన్నుల మాయతొల్గ నిను గానగ వచ్చితి మ్రొక్కుకొంచు నా
పన్నుడవీవె గాద!తనివారగ గొల్తును నీదుపాదముల్
పన్నగశాయి!నా కిడుమ!వాంఛలు కోరని బుద్ధి శ్రీహరీ!//

కామెంట్‌లు