శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
481)అక్షరః -

నాశనము లేకుండునట్టివాడు 
ముక్తి కారణంగా నున్నవాడు 
ఎన్నటికిని చెడనట్టి వాడు 
బ్రహ్మ విష్ణువులు తానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
482)అవిజ్ఞాతా -

అన్నియుతెలిసినట్టి వాడు 
తెలిసినవానికంటే అధికుడు 
భక్తులను కాచుచున్నవాడు 
తనతో పోలికలులేనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
483)సహస్రాంశుః -

అనంతకిరణములున్నవాడు 
అనేక అంశలలో నున్నవాడు 
వేయివిధముల కనిపించువాడు 
సహస్ర అంశాలుగా నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
484)విధాతా -

సర్వాధారము అయినట్టివాడు 
విధిని నడిపించగలవాడు 
బ్రహ్మదేవుడు తానైనవాడు 
జీవులకు విధానమిచ్చు వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
485)కృతలక్షణః -

వేదములను వెలువరించినవాడు 
లక్షణములను కూర్చునట్టివాడు 
కార్యక్రమంము చేయగలవాడు 
సంకల్పమాత్రుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు