491)మహాదేవః -
మహాదేవుడుగా నున్నవాడు
ముక్కంటి తానుగానున్నవాడు
శివశక్తిని కలిగినట్టి వాడు
అంతరాళము నిండినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
492)దేవేశః -
సురేశ్వరుడైయుoడినవాడు
దేవతలకు ఆజ్ఞలిచ్చువాడు
దేవసంబంధమైనట్టి వాడు
ప్రభుత్వం తానుగానున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
493)దేవ భృద్గురుః -
ఇంద్రునికి గురువైయున్నవాడు
దేవగణముల శాసించువాడు
సురలోకమును పాలించువాడు
దేవతలకు గురువైన వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
494)ఉత్తరః -
అందరికన్ననూ అధికుడైనవాడు
ఉత్తమ గుణములున్నట్టివాడు
నక్షత్రవిశేషమైయున్న వాడు
భక్తులకష్టము దాటించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
495)గోపతిః -
గోవులను పాలించునట్టివాడు
నంద నందనుడైన వాడు
ధేనువుల సంరక్షణజేయువాడు
గోకులముకు రాజైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి