ఒక్క కోరిక;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఆకాశం నుండి
సూర్యుడెప్పుడు దూరంగా ఉంటాడో
వెన్నెల నుండి
చంద్రుడెప్పుడు దూరంగా ఉంటాడో
పరిమళం నుండి
పవనమెప్పుడు దూరంగా ఉంటుందో
వసంతం నుండి
ఉద్యానవనం ఎప్పుడు దూరంగా ఉంటుందో
అప్పుడు నేను
నా స్నేహితులనుండి దూరంగా ఉంటాను
నామాట వినబడకుండా నా నేస్తాలకు
సూర్యోదయంకూడా కాదని కాదు కానీ,
నా మిత్రులను జ్ఞాపకం చేసుకోకుండా
నాకు ఏరోజూ శుభదినం కాదని
ఎందుకంటే?.....
స్నేహమేగా మా జీవితం
ఏన్నోజన్మల సంగమబంధం
అందుకే......
నా నేస్తాల జీవితాలు పువ్వుల్లా నవ్వుతూ
ప్రతిరోజూ వికసించాలని
నా మిత్రుల ఆకాంక్షలన్నీ నెరవేరాలని
ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండాలని
ఆ దేవుడితో
ఈ ఒక్క కోరికే కోరుతాను!!
*************************************
:

కామెంట్‌లు