సుప్రభాత కవిత ; - బృంద
ఇనుడినిచూడాలనే ఆశతో
రాతిరంతా  వేచి చూసిన
చుక్కలన్నీ దిగివచ్చి
పువ్వులై విరబూసాయి

రంగులు నింపుకుని 
వెలిగే నింగిని మించి
నవ్వులు రువ్వుతూ
మనోహరంగా విరిసాయి

సుమహాసాల జిలుగులతో
వనమంతా సంబరంగా
ఆగమించు మిత్రుని చూసి
ఆనందపరవశంలో మునిగింది

మంచి ఆలోచనలున్న
ప్రతి మనసూ 
ఆనందపు పరిమళాలతో
అందరినీ ఆదరించు నేస్తమై!

కలుపులు రానివ్వక
కఠినమైన కాపలాతో
నిజాయితీగా స్నేహం పంచే
నిండుమనసే పూలతోట!

పొంగారు కళలతో
బంగారు వెలుగులు నింపి
పుడమి పైన జీవుల
బ్రతుకుల పండుగ చేయాలని

ఆగమించు ఆదిత్యునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు