శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
571)దివః సృక్ -

దివిని అంటియున్నట్టివాడు 
నింగిలో వ్యాపించినవాడు 
ఆకాశమందు నిండియున్నవాడు 
దివికి విస్తరించియున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
572)సర్వ దృగ్వ్యాసః -

సమస్తజ్ఞానములొసగుచున్నవాడు 
వ్యాసరూపమున భాసిల్లువాడు 
మేధను వ్యాపింపజేయువాడు 
వాచస్పతి తానేఅయినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
573)వాచస్పతిరయోనిజః -

విద్యలకు అధిపతియైనవాడు 
గురుస్థానమందున్నట్టి వాడు 
మాతృగర్భమున పుట్టనివాడు 
అయోనిజుడైయున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
574)త్రిసామా -

సామమంత్రస్తుతుడైన వాడు 
మూడువేదములు కీర్తించువాడు 
వేదమందు విలసిల్లునట్టివాడు 
సామవేదపూరితుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
575)సామగః -

సామగానంమును చేయునట్టివాడు 
స్వరవిశేషము తానైనవాడు 
ఒక అర్థాలంకారమయినవాడు 
దయను ప్రసరించునట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు