శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
496)గోప్తాః -

సర్వులనూ రక్షించువాడు 
కాచుటను స్వభావమున్నవాడు 
పాలకుడుగా మసలుచున్నవాడు 
సమూహమునుద్ధరించెడివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
497)జ్ఞానగమ్యః -

జ్ఞానముతోడి తెలియగలవాడు 
చివరి మజిలీ తానైనవాడు 
బుద్ధిని అనుసంధించువాడు 
జ్ఞానగమ్యముగా నిలిచియున్నాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
498)పురాతనః -

సృష్టికి పూర్వమున్నట్టివాడు 
పురాతనుడై తేజరిల్లువాడు 
ఇతిహాసము లందునున్నవాడు 
అవతార నిర్వహణ జేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
499)శరీరభూతకృత్ -

 శరీరముల కల్పించుచున్నవాడు 
ప్రాణులపోషణ చూసెడివాడు 
విశ్వజీవ సృజనము చేయువాడు 
భూతకృతిలో నిమగ్నమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
500)భోక్తా -

లోకమనుభవించు చున్నట్టివాడు 
విశ్వసృష్టిని చూచుచున్నవాడు 
భక్తిభావనను స్వీకరించువాడు 
భక్తులసహపంక్తినుండు వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు