నీరాజనాలు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కరోనా అణుబాంబును అరచేతిలో నొక్కిపెట్టి
ధైర్యంగా మనకు చికిత్స నందించిన
వైద్యనారాయణులకు నీరాజనాలు!
నిద్రలేని రాత్రులతో వడలిపోయినాగాని
జనతాలాకౌటును విజయతీరం చేర్చిన
రక్షకభట సిబ్బందికి నీరాజనాలు!
పరిసరాలను పరిశుభ్రం చేస్తూ
తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన
పారిశుధ్య కార్మికులకు నీరాజనాలు!
స్వీయ నియంత్రణతో నిర్బంధాన్ని పాటిస్తూ
కనిపించని శత్రువుతో పోరాడిన
భరతవీరులందరికీ నీరాజనాలు!
భారతీయ సంస్కృతే మానవాళి రక్ష అని
పాశ్చాత్య నాగరికతను వదిలించుకున్న
ప్రపంచ ప్రజలకు నీరాజనాలు!
కరోనాపోరులో ముందువరుసలో ఉన్నవారికి
చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి
సంఘీభావం తెలిపినవారందరికీ నీరాజనాలు!
**************************************

కామెంట్‌లు
Joshi Madhusudhana Sharma చెప్పారు…
��������������������బాగుంది సార్ కవిత.