అవని మెచ్చిన ఆశయ జ్యోతి అంబేద్కర్‌;- డాక్టర్‌ ఎన్‌ శ్రీరాములు-ఎస్‌ఏ హిందీ- జెడ్‌పిహెచ్‌ఎస్‌,- గొల్లపల్లి, పుత్తూరు(మండలం), తిరుపతి(జిల్లా).
 అవని మెచ్చిన ఆశయ జ్యోతి.. చదువుల తల్లి మెచ్చిన జ్ఞాన శిఖరం
విశ్వ జనులు కీర్తించిన మేధో సంపదకు వారసుడు
రాజకీయ చదరంగంలో అపర చాణక్యుడు
అమావాస్య చీకటిలో వెలుగు రేఖలను పంచిన రాజ్యాంగ నిర్మాత
బహుజనుల జీవితాలలో విద్యా వెలుగులను పంచిన జ్ఞాన సింధూరానివి
కష్టాల కడలిని సైతం దాటి కర్తవ్యమనే కంకణాన్ని ధరించిన విజేతవి
రాజ్యాంగ రచనతో బహుజనుల జీవితాలను సరస్వతి ఒడికి చేర్చిన మానస పుత్రునివి
ఎన్నో ఒడిదుడుకులను ఎదురీది శ్రమ అనే ఆయుధంతో విజయాన్ని దాసోహం చేసుకున్న కార్మిక నేతవి..
ఆలోచనలను ఏరి కూర్చి పూమాలికలల్లిన అభినవ దార్షకునివి
సమసమాజమే భారత భవిష్యత్తు అని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రపంచ మేధావివి
అవినీతి రాజకీయ కుతంత్రాలను తరిమి కొట్టే ఓటు అనే ఆయుధాన్ని అందించిన అవని పుత్రునివి
రూపాయి సృష్టికర్త బ్యాంకుల స్థాపనకు అంకురానివి
కర్షక, కార్మికుల మరో గొంతుకవి..స్త్రీల హక్కులకు ఆరాధ్య దేవుడివి
అరుణోదయ సూర్య కిరణాలను నవ జీవన స్రవంతికి అందించిన నవసమాజ నిర్మాతవి
సమ సమాజ స్థాపనే నవ భారత నిర్మాణానికి శ్రీకారం అని వెలుగెత్తి చాటిన నవయుగ వైతాళికునివి
సూర్య చంద్రులు ఉన్నంత వరకు నీ కీర్తి అజరామరం
అందరికీ అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు
                   
         
కామెంట్‌లు