సీతారాముల కల్యాణ సంధర్భంగా కవి, రచయిత 'అయ్యలసోమయాజుల'కు ఆత్మీయ సత్కారం

 విశాఖపట్నంలోని  మధురానగర్ లో సీతారామ సేవాసమితి మరియు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుమారు రెండు  దశాబ్దాలుగా శ్రీరామ నవమి నాడు జరిగే కళ్యాణ ఉత్సవంలో పూజ్యులు సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు విశ్రాంత రసాయన శాస్త్ర శాఖాధిపతి,బి.వి.కె కళాశాల  విశాఖపట్నం ధర్మపత్ని వేంకట రమణమ్మ గారితో ఉగాది నుంచి సీతారాముల కల్యాణం వరకు సమితి సభ్యుల ఆదరాభిమానాలతో నిర్విఘ్నంగా పాల్గొంటు తమకు  పెద్ద దిక్కు  దంపతులిద్దరు ఉంటు సలహాల నందిస్తు సనాతన సంప్రదాయం ప్రకారం వివాహా క్రతువుని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట తప్పక జరుగుతుందని చెప్పి రామ కల్యాణం లోక కల్యాణమని ఎన్ని అవరోధాలు ఎదురైన నిర్విరామంగా వయస్సు పై బడిన కార్య నిర్వాహక వర్గాన్ని ప్రోత్సహిస్తు సంవత్సరాది నుంచి శ్రీరామశాంతి హోమం  పూర్ణాహుతి వరకు పాల్గొంటు అందరిని ఆప్యాయంగా పిలిచే ప్రసాద్ మాష్టారు దంపతులను డాక్టర్ కళ్యాణి, రవి, సుగుణ, అప్పారావు ,మీనా   మిగతా కార్యనిర్వాహక సభ్యుల సమక్షంలో శ్రీరామచంద్రుని  వేదిక పక్కనే సుఖాసనం పై కూర్చుండ బెట్టి
దుశ్శాలువ, పూలదండలను వేసి భగవద్గీత పవిత్రగంధమునిచ్చి ఆత్మీయ సత్కారం చేసి పాదనమస్కారం చేసి ఆశీస్సులు పొందారు.
బదులుగా ప్రసాద్ మాష్టారు అయోధ్య లో శ్రీరామచంద్రుని ప్రతిష్ట జరిగిన తరుణంలో పుత్ర, పుత్రికా సమానులైన  నిర్వాహక సభ్యులు పవిత్ర ప్రాంగణములో తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని ఎదుట తాను అధ్యాపకునిగా, కవి, రచయిత గా ఎన్ని సత్కారాలు పొందినా  చేసిన ఈ సత్కారం జీవితంలో మరువలేనిదని తన జన్మ సార్ధకత అయిందని ఆనందంతో చెప్పారు..!
............................ 
కామెంట్‌లు