మార్పు-'నన్నపురాజు విజయశ్రీ-- రంగారెడ్డి

 కుసుమ ధర్మన్న కళా పీఠం
===================
మహేందర్ M, A. వరకు చదువుకొన్నాడు. ఎదో ఉద్యోగం చేయాలన్న తపనతో అనేక ఉద్యోగాలకోసం అనేక మందిని సంప్రదించి ఒక్కోక్క నెల ఒక్కోక్కరి దగ్గరచేశాడు భరించలేని కష్టాలు అనుభవించాడు ఆ ఊరిలో అనుభవజ్ఞుడు నరేందర్ నుసంప్రదించి తన బాధను వివరించుకున్నాడు అప్పుడు నరేందర్ మహేందర్ తో నాయనా జీవితం వడ్డించిన విస్తరి అనుకున్నావా కాదు అని అన్నాడు. ఇంటిలోతల్లి శాంతమ్మ నాయనా రామయ్య ఎపని పాట లేకతిరుగుతున్నావని పోరు పెట్టారు.ఈ పెద్దల పోరుభరించడం కష్టం అని మహేందర్ అనుకొని నన్ను ఎవరు ఏమి అనని వేధించని వారు లేని అడవి లోకి వెళ్లి బతకాలని ఉంది అని మనసులో అనుకున్నాడు.మహేందర్ తన స్నేహితుడు అయినా సుధాకర్ నుసంప్రదించాడు.నీవు ఎలా జీవిస్తున్నావు అని అడిగాడు అప్పుడు సుధాకర్ మహేందర్ తో M.A..చేశాను కానీ తిరిగి తిరిగి ఎ ఉద్యోగం రాలేదు.అయినా నేను బాధపడక భయపడక చిన్న హాటల్ పెట్టుకోనిఉదయం నుండి రాత్రి వరకు ప్రజలకు అందించి హాయిగా జీవిస్తున్నాను.స్వయం ఉపాధితో ఎ చీకూ చింతా లేకజీవిస్తున్నాను నాకు జీవితం విలువ తెలుసుఅందుకే ఇలా ఉన్నాను సంతోషంగా ధైర్యంగా ఎవరిపై ఆధారపడకుండా నేనే కొంతమందిని పోషిస్తున్నాను అని సుధాకర్ మహేందర్ తోచెప్పాడు అది విన్నమహేందర్ మనసు మార్చుకొని ఏదో ఒక పని చేసుకోని హాయిగా జీవించాడు.
నన్నపురాజు విజయశ్రీ
కామెంట్‌లు