కావ్యకంఠ గణపతి ముని! అచ్యుతుని రాజ్యశ్రీ
అరుణాచల రమణమహర్షి ఆయనని నాయనగారూ
అని పిలిచేవారు.కావ్యకంఠులవారు మహా తపశ్శక్తి సంపన్నులు.ఒకసారి ఆయన తన తమ్ముడిని తీసుకుని అరుణాచలం వెళ్లారు."అన్నయ్యా! ఆకలి" అని ఆపిల్లాడు అల్లాడిపోతున్నా ఏకాదశి రోజు కావటంతో ఎవరూ పట్టెడన్నం పెట్టలేదు.ఆయన అమ్మవారి స్తోత్రం చేస్తూ ఒక ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే సాయంసంధ్య వేళ ఆఇంటి గృహస్థు బైటికి వచ్చి " అయ్యా! మాకు ఇద్దరు భోక్తలు కావాలి.వంటకాలు సిద్ధంగా ఉన్నాయి.కానీ అతిథులకు పెడితే గానీ మేం తినం." అని లోపలకి ఆహ్వానించి అన్నదమ్ములకి భోజనం పెట్టారు ఆదంపతులు.. ఆరాత్రి బైట అరుగుమీద పడుకున్నారు అన్న దమ్ములు.తెల్లారి లేచి చూస్తే ఇల్లు గృహస్థు ఆయన భార్య కన్పడలేదు.తాము
వినాయకుడి గుడి బైట నిద్ర పోయారని గ్రహించిన కావ్యకంఠ ముని దైవానుగ్రహం కి ప్రణమిల్లారు.నిజంగా మన దేశంలో అణువణువూ దైవం దైవ శక్తి తో నిండిన పుణ్య భూమి.నిజంగా మనం అదృష్టవంతులం కదూ? 
కామెంట్‌లు