శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
486)గభస్తినేమిః -

సూర్యకిరణాలు గలిగినవాడు 
కాంతిచక్రముకు కేంద్రమైనవాడు 
మయూఖమై జ్వలించువాడు 
సూర్యనామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
487)స్వతస్థః -

అందరిలో నుండినట్టివాడు 
తనకు తానే ఏర్పడినవాడు 
స్వయంభువు అయినట్టివాడు 
స్వతఃసిద్ధ దివ్యతగలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
488)సింహః -

సింహంవంటి బలమున్నవాడు 
పరాక్రమవంతుడైనట్టి వాడు 
నారసింహమై ప్రభవించినవాడు 
మృగరాజువలే శౌర్యమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
489)భూతమహేశ్వరః -

సర్వభూత ప్రభువైనవాడు 
ప్రాణులకు ఈశ్వరుడైనవాడు 
ప్రకృతిని శాశించుచున్నవాడు 
సర్వభూతముల పాలించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
490)ఆదిదేవ-

తొలిదేవుడు తానైనవాడు 
ఆదినుండీ దేవుడైయున్నవాడు 
మొదటి పూజామూర్తియైనవాడు 
దివ్యతలను కలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు