ఆధ్యాత్మ గీతం;-నీ నుండే;- కోరాడ నరసింహా రావు..!
పల్లవి :-
నీ ను0డే ఉద్భవించు
 నీ పైనే  ప్రవర్థిల్లు
   నీ లోనే ఐక్య మయే ప్రాణి కోటి క0తటికీ... 
తల్లివి, తండ్రివి, గురువును, దైవము... 
     సర్వము నీవమ్మా...! 
 ఓ సృష్ఠి , స్థితి, లయ కారకి 
 భూదేవతా నీకు వందనం... 
  నీకు వందనం...!! 
          * నీ నుండే...... *
చరణం :-
 మా అమ్మవు నీవు... 
 నీకు అమ్మ గంగమ్మ... 2
 ఆ గంగమ్మ పునీత,అగ్నిపుత్రిక
 ఈ అగ్నికే అమ్మాయెను ఆ వాయువు... 2
 సృ ష్ఠి  సమస్తమూ శక్తిమయము,, 
     ఈ శక్తికే నాధుడు ఆ సర్వే స్వరుడు ! 
 ఎవ్వరికీ కానరాక ఉన్నాడాగ గనంలో...! 2
చరణం :-
 పంచ భూతాత్మక ప్రపంచమ్మిదిరా... 
 సత్యమును తెలుసుకుని ప్రవర్తిల్లరా.... 
 వి ధేయుడవై  భోగములను అనుభవించరా....! 
 ఆనందించి నీవు తరియించ రా....!! .... 3
        ******
కామెంట్‌లు