నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
 మధ్య అరిజోనా ప్రాంతం లో ఉన్న పర్వతాలకి ఆంగ్లంలో సూపర్స్టిషన్ మౌంటెన్ రేంజ్ అనిపేరు.అంటే నమ్మకం మూఢనమ్మకాలు అని కూడా అనవచ్చు. బ్రహ్మాండమైన బంగారు గనులు ఇక్కడ దాగున్నాయి అని జనం నమ్మారు.ఆగని గోడలు ఇలా చేత్తో తడిమితే చాలు బంగారం జలజలరాలేదిట.జాకోబ్ వాల్ట్జ్. అనేడచ్ వ్యక్తి వల్ల ఇది వెలుగు లోకి వచ్చింది.అతను నిజానికి జర్మన్  వ్యక్తి.గనుల్లో పనిచేసేవాడు.బంగారు రజనీతో అతను పట్టణంలో కి తీసుకుని వెళ్లి ప్రచారం చేశాడు.1891 నుంచి నేటి దాకా ఆ గనులకోసం వేట మొదలైంది.ఇంతవరకూ దొరకలేదు.1868 లో జాన్ మార్షల్ కాలిఫోర్నియా నదీప్రాంతంలో  బంగారం కనుగొన్నాడు.ఇంకే ముంది? ప్రపంచంలో వింత గా అది మిగిలింది కానీ బంగారం మాత్రం దొరకలేదు.దాన్ని కాలిఫోర్నియా గోల్డ్ రష్ అన్నారు.
లోబెన్ గులా. జులూ అనే తెగ నాయకుడు.బాగా లావుగా ఉండే వస్తాదు.అతని పుట్టిన రోజు కి బంగారం వజ్రాలు తెచ్చి అతని బరువుని తూచి కానుకలు ఇచ్చేవారు.25ఏళ్లు ఏకధాటిగా పాలించాడు.అతని అనుచరులు బోలెడంత బంగారం వజ్రాలు ఏనుగు దంతాలు పుట్టిన రోజు కానుకగా అందించేవారు.బ్రిటిష్ వారి రాకతో అతన్ని ఆబంగారంని ఎక్కడో సురక్షితంగా దాచారు. బ్రిటిష్ కంపెనీ కళ్ళబడకుండా తన అనుచరులతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.అలా ఆఫ్రికన్ రాజు లోబెన్ గులా సంపద ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది సుమా🌹

కామెంట్‌లు