సుప్రభాత కవిత ; - బృంద
మేటవేసిన శిలల వంటి
పేరుకున్న కలలు ఎన్నో!
ఊటలాటి ఊహలతో
ఊగిసలాడే అలలు ఎన్నో!

తేలిపోవు మేఘాలు
తేటనీటి అద్దాన తమ
అందం తేరిపార చూసుకుని
మురిసిపడే క్షణాలెన్నో!

తెలివెలుగుల  దొంతరలో
తొలికిరణపు తాకిడికి
వెలిగిపోతూ  శిఖరాలు
ఒలకబోసే వగలెన్నో!

ఏటి ఒడ్డున ఏపుగా
ఎదిగి ఒదిగి నిలుచుని
తరూశ్రేణి కాపాలాగా
చేయించే కవాతులెన్నో!

కనులు కలలు కంటే
మనసున అలలు రేగితే
కలతలేవో శిలలవోలె
అడ్డుపడి ఆపే ఊహలెన్నో!

చూసిన ప్రతీదీ సొంతం కాదు
ఆశించిన ప్రతీదీ అందదు
అందిన వాటిలో ఆనందం
పొందినవే మనపాలి అమృతం

తృప్తిని మించిన సంపదలేదు
సుషుప్తిని మించిన స్వర్గంలేదు
అలజడి లేని మనసుకు
అందని ఐశ్వర్యం లేదు

ప్రశాంతమైన ఉషోదయానికి
ఉత్సాహంగా

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు