పుస్తకం నమోస్తు; - కోరాడ నరసింహారావు!
 అక్షర ముత్యాలతో పదముల మాల లల్లి ... జ్ఞాన తోరణాలతో ముస్తా బైన పుస్తకం...! 
మానవ మస్తిష్కంలోని అజ్ఞానతిమిరాన్ని తొలగించి... 
 విజ్ఞాన ప్రకాశ0తో నింపి... 
ఆనందార్ణవంలో ఓలలాడించే పుస్తకం....పుట్టింది మొదలు... 
 బావి తరాలకు బంగరుభావిష్యత్తునుఅందిస్తూనే ఉంది...!! 
  పుస్తకమంటే... మన వారసులకు మన మిచ్చే వెలకట్ట లేని ఆస్తి .. ! 
 పుస్తకం చద వటమంటె... 
  ఏక క్షనంలో మూడు విధాాలు గా ప్రభాావితం కావటం..!! 
  మనసు చదువు తుండగనే బుద్ది ప్రభాావితమై ఆలోచనలు రేకెత్తించి...నిర్ణ యాలను చేయిస్తుంది...! 
 ఒక పుస్తకం మూడు తరాల ను మించి మూల ధనమై నిలుస్తుంది...!! 
 పుస్తకం పుట్టుక మానవ సమాజాల వికాస పురోగతికి నా0ది...! 
 విజ్ఞాన శాస్త్రాల ఆవిర్భా వానికి తొలి అడుగు పుస్తకమే ! 
  పుస్తకం సరస్వతీ ప్రత్యక్ష సాక్షాత్ స్వరూపం...! 
 అజ్ఞాన తిమిర సంహారం
 జ్ఞా న ప్రకాశ ప్రదీప్తం ... 
   పుస్తకం నమోస్తుతే💐🙏🌷. ..
.

కామెంట్‌లు