తిరుమలరావు ఉగాది గీతానికి తెలుగు వెలుగు ప్రశంసాపత్రం
 రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు జాతీయ స్థాయిలో ఉగాది ప్రశంసాపత్రం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుచున్న క్రోధి నామ సంవత్సర ఉగాది వారోత్సవాల్లో తిరుమలరావు, ఈ గౌరవం పొందారు. 
పాడవే పాడవే ఓ కోయిలా! హృదయాలలో ప్రేమ చివురించగా! పేరిట నిర్వహించిన జూమ్ సమావేశంలో తిరుమలరావు తన సాహిత్య గానాలాపన చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈమేరకు తిరుమలరావుకు జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రాన్ని తెలుగు వెలుగు జాతీయ 
అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు, జాతీయ ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలినాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మీసాల చినగౌరునాయుడు, ఎ.పి.మహిళా విభాగం అధ్యక్షురాలు డా.బి.హెచ్.వి.రమాదేవి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పైడి నవనీత రవీందర్, జాతీయ గౌరవాధ్యక్షులు గంటా మనోహర్ రెడ్డిలు ప్రకటిస్తూ అంతర్జాలం ద్వారా పంపారు. 
ఇటీవల విజయనగరంలో ఉగాది రోజున వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కారాన్ని, తెలుగు వెలుగు ఉగాది పురస్కారాన్ని, ఆర్ట్ ఫౌండేషన్ ఉగాది అక్షరస్వరం ప్రశంసాపత్రంలను స్వీకరించిన కుదమ తిరుమలరావు, మరో ప్రశంసాపత్రానికి ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు