పుట్టిన రోజు;- గంగదేవు యాదయ్య
 బహుమానాలూ..కానుకలూ 
పుట్టిన రోజూ పండుగలూ...
కొత్తవి బట్టలు..
కొత్తవి చెప్పులు...
ఇరుగూ- పొరుగూ స్నేహితులూ..
బడిలో దోస్తుల..బహుమానాలూ..
అమ్మా..నాన్నల  ఆశీర్వాదం 
 ప్రాణ మిత్రులా! పలకరింపులూ 
 మేలును కోరే..బంధుమిత్రులూ..
అందరు రాగా..ఆనందంతో..
రంగుల,రంగులబూరలు..బుగ్గలు 
 నచ్చిన కేకూ ...ఊరించంగా...
 వెలుగెడి ..మెరిసెడి 
కోవు వత్తులూ ( క్యాండిల్స)
మంచి కేకునూ..కరగ దీయునని ..
దగ్గరి మిత్రులు వత్తిడి చేయగ 
ఉఫ్ అని ఊదీ 
ఆర్పి వేసితిని...
కేకును కోసితి 
ఆనందంతో..
చప్పట్లుకొట్టిరి 
బంధుమిత్రులూ..
అంతా పాడిరీ..
ఆనందపు రోజని....
చెప్పిరి..చెప్పిరి
హ్యాపీ బర్త్ డే...
పంచి పెడితిమీ ..
కేకువి ముక్కలూ..
చాక్లెట్..బిస్కెట్ 
తలొక్క ముక్కా...
ఖారా..భూందీ..
మిఠాయి ముక్కా..
అన్నీ తిన్నరు..ఆనందంగా..
హ్యాపీ..బర్తడే అందరు చెప్పిరి..
నన్నే అందరు అభినందించిరి..
నాకే అందరు కానుక లిచ్చిరి...
 అందరు పరిపరి అభినందించగ..
జరిగెను నాదీ పుట్టినరోజూ...
మీకును పంపితి పిలుపులు కొన్నీ 
వచ్చిన వారికి ఇచ్చితి బహుమతి 
వచ్చిన వారికి ఇచ్చితి కేకూ ...
నీవూ వస్తే 
 నీకూ...ఇస్తా..
మళ్లీ సారికి మళ్లీ ఇస్తా..
అప్పటి వరకూ హాయిగ ఉందాం
అప్పటి వరకూ హాయిగ తిందాం...హాయిగా విందాం..
   కుర్రో- కుర్రు .
( రచయిత: ఉయ్యాల- జంపాల, బుజ్జి పద్యాలూ, పాటల పుస్తకం)

కామెంట్‌లు