'హరీ!'శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 83.
ఉత్పలమాల.
డాంబికమైన దర్పములఁ డబ్బును గోరుచు శుంఠలై జనుల్
దంబముతో మదాంధులయి దారిని తప్పి చరింతు రక్కటా!
నంబలి త్రావుచుండి పరమాద్భుతమౌనిను దల్చినంత మా
వెంబడి వచ్చుచుందువట!ప్రేముడిఁ జూపుచు మిత్రతన్ హరీ!//

84.
ఉత్పలమాల.
వాదన లేల? సద్గతులఁ వాసిగ గోరుచు నిన్ను వేడ స 
మ్మోదముగా ననున్ గనవు? ముచ్చిరు చుంటిని  కొంచెమైన మ
ర్యాదను జూపరాద!నిను యాచన జేయగ వచ్చియుంటి నీ
పాదము లందు నా శిరము వంచుచు వాలితి గాంచుమా!హరీ!//
.

కామెంట్‌లు