జన్మ జన్మల స్నేహ... ప్రేమ బంధం... । ;= కోరాడ నరసింహా రావు.
తోడ బుట్టిన వారు లేని బాల్యం సార హీనం...! 
 ఆనంద రహితం..!! 
బాల్య మ0తా...తోడబుట్టిన వారు0టే అది ఆనంద నందనమే...! 
ఆ బాల్యపు తగవులు, కొట్లా టలు... పేచీలు , పోటిలు..., 
 ఆ బాల్యానందానికి అవధు లేవీ...!? 
పెరిగి పెద్దవు తున్నా... 
ప్రతియేడూ... రాఖి లు కట్టే
 ఎక్కచెల్లెళ్లు... బహుమాతులు యిచ్చే అన్నా తమ్ముళ్లు...! 
 ఆ ఆనందాలు వర్ణించ టానికి
 భాష యేది...?! 
పెళ్ళిల్లయిపోయి ఎవరి బ్రతుకు వారు బ్రతుకు తున్నా
 పండగ లకు, పబ్బాలకు ... 
 కన్నవారింటి కొచ్చే ఆదపిల్ల లు... అన్నదమ్ములతో పంచు కునే ఆపయతానురాగాలు... 
 వర్ణనాతీతాలే...!! 
  అన్నదమ్ము లంటే... అక్క, చెల్లెళ్లకు తోడూ - నీడ గా నిలిచే భరోసా...! 

అక్క చెల్లెళ్ల0టే అన్న, దమ్ములకు... ఆపయతానురాగాలు పంచే
పేగు బంధం..!! 

భగినీ చేతి భోజనమ తిన్న
 అన్న దమ్ము లదే అదృష్ట0

తోడ బుట్టిన వారు ఒకరి కొరకు ఒకరు కష్టాలలో కార్చే కన్నీరు గాని సంతోషాలతో కార్చేఆనం ద భాష్పాలు గానీ... 
  అవి వెలకట్ట లేనివి.... ।।

సోదరీ - సోదరులు గా పుట్టటమంటే... 
 జన్మ - జన్మ ల స్నేహపు ప్రేమ బంధమే...!! 
       *******
కామెంట్‌లు