సుప్రభాత కవిత ; - బృంద
తూరుపు ప్రసవించిన
వెలుగుల బంతిని చూసి
కన్నుల కాంతులు నిండగా
మై మరచి చూస్తున్న  నింగి

నేలకు పాకుతున్న బంగరు
ధారలా మెరిసే కాంతి కిరణాలు
తెస్తున్న బాలుని  కారుణ్యాలు
అందుకుని మురిసె అవని

ధగధగల మెరుపుల మధ్య
ఎదిగివస్తున్న భానుని బింబము
చూచి అచ్చెరువున నిలచిన
తరువులు తోచె  చిత్తరువులై!

జగద్రక్షకుని చూపు సోకిన
జగతి జయజయకారాలు చేస్తూ
జనకుని చూసిన చందమున
సంబరాన పరవశించి పొంగిపోయె!

మనుగడలో ఒడిదుడుకుల
మర్మ మెరిగి నడచుకొమ్మని
చీకటివెలుగుల  తపనలు
తప్పవు ప్రతి  మనిషికి అని

ఎరుకతో ఆడుగులు వేయించి
దోవలో ముళ్ళు తగ్గించి
చేయి పట్టుకు నడిపించి
తెరువు చూపి దరి చేర్చే దైవానికి

🌸🌸సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు