వింతలు విశేషాలు సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ

 కాంగో లో పిగ్మీజాతిప్రజలుండేప్రాంతంలో ఆనాటి డైనోసార్ ఉన్నట్లు సమాచారం.పిగ్మీలు వాటిని మొకెలెమెంబె అని పిలిచేవారు.ఏనుగుసైజులోపొడవాటి పాములామెడ 3 కాలివేళ్ళు న్న వెడల్పాటి పాదాల తో ఉండేవి ఆప్రాణులు. పాదాలు మనం వాడే పెద్ద పెనం సైజులో ఉండేవి.ఎరుపు బ్రౌన్ కల్సిన రంగు గ్రే కలర్ లో పొడవాటి బలంగా ఉన్న తోకతో నీటిలో జీవించే ప్రాణి.పిగ్మీలకు డైనోసార్ల చిత్రాలు చూపారు శాస్త్రవేత్తలు.బ్రొంటోసారస్ అనే గడ్డి తినే డైనోసార్ని వారు గుర్తించారు.అది 70 మిలియన్ల ఏళ్ల క్రితం భూమి పై తిరిగింది.మరి రామాయణం మహాభారతం భాగవతం లో ఇలాంటి రాక్షసుల వర్ణన ఉంది అంటే మన ఋషుల ప్రజ్ఞను తెలుసుకోవచ్చు.🌹
కామెంట్‌లు