మా పెరటి తోటలో....
విరిసిన పువ్వులే ...
మాపాప నవ్వులు...!
మా జామ చెట్టుపై వాలిన
రామ చిలుక పలుకులే.....
మాపాప ముద్దు-ముద్దు మాటలు...!
హంసలకే మా పాప
బుడి బుడి నడకలు నేర్పినది
కోయిలకే మాపాప...
తీయని కూతలు మప్పినది.!
నెమలికి ఆ నాట్యా లన్నీ
మా పాప నేర్పినవే...!
జాబిలితో మాపాప...
ఆటలు ఆడు కుంటు0ది..!!
మాపాపతో ఆ కాకి...
కబురు లెన్నో చెబుతుంది...
ఆశ్రీమహాలక్ష్మీయే,మాయి0ట ... బుడి- బుడినడకలు...
ముద్దుల మాటల...
చిట్టి పాపగా వచ్చినది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి