సాహితీ కులగిరి శేఖరుడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 తెలుగు సాహిత్య వైభవాన్ని పునఃప్రతిష్ఠించినవాడు
తెలుగు లతావితానమును చిగురింపజేసినవాడు
అశేష తెలుగుకవులను సమూహపరచినవాడు
ఎక్కడో అనామకంగా ముడుచుకుపోయి
తమ ఉనికినేమరచిన కవిశేఖరుల
హృదయాంతరాళాలను వెలిగించి
వారి కవితాకాంతులతో దివినీభువినీ
దేదీప్యమానంగావించిన అగణితగుణశీలుడు
అగణితపుస్తకపఠనంతో సాహితీ సంద్రాన్ని
ఔపోసనపట్టిన సాహితీ కులగిరి శేఖరుడు
సర్వంబెరిగిన జ్ఞానమూర్తి అయినా
మౌనమునిలా చిరునవ్వులు చిందించేవాడు
తనవృత్తికీ ప్రవృత్తికీ హస్తిమశకాంతరమున్నవాడు
అఖండ మేధావీ అద్భుత పాలనాదక్షుడు
తెలుగు కవితా వైభవం సంస్థను స్థాపించి
అశేష తెలుగు సాహిత్య సృజనకు బీజం వేసినవాడు
ఆధునిక తెలుగుసాహితీ భోజమహారాజు
కవిపండితపోషకుడు శ్రీ మేక రవీంద్రుడు!!!
**************************************
కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
👌👏👏🌹🙏🌹మంచి కవితా రూపక ప్రశంస.