పంచపది లఘు కవితా ప్రక్రియలు- గేయ రూపంలో;- పోరంకి నాగరాజు.- కామవరపుకోట
రండి!రండి!రండి!కవికోవిదుల్లారా! 
పంచపది ప్రక్రియలు తెల్సుకుందాం!

పసందైన పంచపదులనల్లేద్దాం!
ఎనలేని ఆనందాన్ని పొందుదాం!

పంచపదులు నిత్యం చదువుదాం!
విషయావగాహన పెంచు కుందాం!

పంచపదులనే చర్చించు కుందాము!
పంచపదుల పరిధిని పెంచుకుందాం!

పంచపదులను కవులకు వివరిద్దాం!
క్రొత్త వారికి శుభాహ్వానం పలుకుదాం!

పంచపదుల మర్మం తెలుసుకుందాం!
కవినామంతో మనపేరును చాటుదాం!

ప్రక్రియను నలుగురికి తెలుపుదాం!
సాహితీ జగత్తులో కీర్తి పొందుదాం!

బాల పంచపదిలో పాల్గొందాం!
బాలల కర్థమయ్యేలా రాసేద్దాం!

హిందీ బాల పంచపదిలో చేరుదాం!
హిందీ కవనాలతో పాఠం బోధిద్దాం!

సప్తవర్ణ సింగిడిలో విహారం చేద్దాం
ఏడు విధాల పంచపదులు రాద్దాం

పంచాక్షరి పంచపదిలో పాల్గొందాం
సూక్ష్మ కవితలనల్లేద్దాం అలరిద్దాం 

ఇది నా స్వీయ రచన అని ధృవీకరిస్తున్నాను.

కామెంట్‌లు