కోరిక!!!-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
కోరిక లేకుండా జీవించడం ప్రమాదకరం!!
ఏ ఉపయోగం లేని ఏ లక్షణము లేని
పదార్థం కానీ మనిషి కానీ ఉండడు. ఉండేట్లు ఉంటే అది చేతగానితనం!!!!

ఉనికిని కాదని ఎదిగే ఏ మనిషి గాని
ఆలోచన గాని అత్యంత ప్రమాదకరమైంది!!
కోరిక అన్నది గుణం 
అణచివేయడం నిర్గుణం కాదు అధర్మం!!!

కోరికకు మూలం బలం తుంచి వేయడం బలహీనత.
కోరిక లేకుంటే గమ్యం లేదు కోరిక యాత్ర కాదు ఒక మంత్రం!!

కోరిక వెలుగుతున్న దీపం మండుతున్న కొలిమి. ఆర్పేస్తే మిగిలేది చీకటి.
కోరికా ఆశకు ఒక నిచ్చెన కోరిక ఒక నిర్మాణం. కోరిక స్నేహానికి ప్రేమకు ఆధారం.!
కోరిక వల్లే ప్రశ్న పుట్టింది కోరిక వల్లే సమాధానం దొరుకుతుంది.!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా
కామెంట్‌లు