మనరాజ్యాంగం గూర్చిఅవగాహన కల్పిద్దాం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం
మనరాజ్యాంగం గూర్చి
బహుళ ప్రచారం చేద్దాం

పౌరహక్కులు విధులు
రాజ్యాంగం బలహీనులకు
ఎలాబాసటగా నిలుస్తుందో
సోదాహరణంగా వివరిద్దాం

రామాయణం భారతాలేకాదు
రాజ్యాంగాన్ని మనమంతా
మన మన మాటల్లో వివరించేలా
 సగటు భారతీయుడు కూడా చెప్పాలి
అందుకై రాజ్యాంగంమీద
అవగాహన కల్గిన మేధావులతో
ప్రసంగాలను గ్రామగ్రామాన
ఇప్పించాలి

భారతరాజ్యాంగం పై డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి అది సకలమానవాళికి ఎలా తోడ్పడుతుందో చూపాలి

అప్పుడే ప్రతిపౌరుడు
రాజ్యాంగం
మనకందించిన ఫలాలను అనుభవించగలడు
ఆ దిశగా ప్రయత్నము చేసిన నాడు భారతరరాజ్యాంగం
మనకు ఓదారిదీపమవుతుందనుటలో
ఎలాంటి సందేహము లేదు

కామెంట్‌లు