కంచి పరమాచార్య! సేకరణ ‌.. అచ్యుతుని రాజ్యశ్రీ
 నడిచే దైవం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వామి వారు.ఆయన ముందున్న పీఠాధిపతి కేవలం 7రోజులు పదవిలో ఉండి మసూచితో కాలం చేశారు.అప్పుడు చిన్నారి 13 ఏళ్ల 
జినీ ని బండిలో కంచికి తీసుకుని వెళ్లారు. అప్పటిదాకా అమ్మ పెట్టే చద్దన్నం తిన్న ఆచిన్నారి చాలా బాధపడ్డారు.ఆనియమాలు నిష్ఠలు చాలా కఠినం.సత్యదండం పట్టుకోవడం మర్చిపోయి పక్కనపెట్టేసేవారు ఆచిన్నారి
ఆయనను పక్కనుండే పశుపతి అయ్యర్ పొద్దు గూకులూ హెచ్చరించేవారు.ఆచిన్నారి పరమాచార్య గా 70 ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని కన్నీరు కారుస్తూ " నాజీవితం లో అయ్యర్ చుక్కాని" అన్నారు.
దలైలామా ఆయన్ని ఇలా ప్రశంసించారు "ఈశతాబ్దిలో ఏకైక అపూర్వ పూజనీయసన్యాసి కంచి పరమాచార్య."
ఆయన హైదరాబాదులో ఉన్న రోజుల్లో సాయంత్రం
మంగళ వాద్యాలు పూజటైంలో మోగించేవారు.కానీ
నవాబు ఇంటి విషాదసంఘటన జరగటంతో వాద్యాలు వాయించరాదు అని హుకుం జారీ ఐంది.కానీ స్వామివారి పూజకి ఆయన అనుమతితో
మంగళ వాద్యాలు వాయించుకోవచ్చు అని నవాబు
అనడం ఆనాటి వ్యక్తుల గొప్పతనం కదూ?జినీ 3 ఏళ్ల పిల్లాడు గా ఉన్నప్పుడు జరిగింది ఈఘటన.పొరుగింటివారు బెల్లం పాకం చేసి కొంత
ఆగిన్నె అడుగున వదిలేసి ఇంటికి తాళం వేసి ఊరికెళ్ళారు.ఆరాత్రి ఆఇంట్లోంచి చప్పుడు విన్పడ్తోంటే దొంగలు పడ్డారు అనుకుని జనం కర్రలతో బైటకొచ్చి తాళంపగులగొట్టారు. ఓపిల్లి ఆగిన్నెలోమూతిపెట్టి నాకుతుండగా దాని మెడ దాకా
ఇరుక్కుపోటంతో అది అటూఇటూ పరుగులు పెడుతోంది.ఎలాగో దాన్ని బైటికి లాగడం జరిగింది.ఆచిన్నారి ఇలా అన్నాడు " పెద్ద పాత్రలో ఐతే పిల్లి తల ఇరుక్కునేదికాదు". సరిగ్గా 70 ఏళ్ల తర్వాత ఓచెంబులో పాలకోసం పిల్లి తల పెట్టడం
అది ఇరుక్కుపోయి గంతులేయటం చూసి పరమాచార్య ఇలా అన్నారు " దానికి ఇబ్బంది లేకుండా పెద్ద గిన్నెలో పాలు పోసి పెట్టండి."
మనిషి కూడా ఈ ప్రాపంచిక సుఖభోగాలు కీర్తి కై
అడ్డదారులు తొక్కి పిల్లిలా గిలగిల లాడ్తాడు."ఒకసారి ఆశ్రమ వంటవాడు మినప్పప్పుకాజేస్తే పట్టుకున్నారు.స్వామివారు అడిగితే " నాకు గారెలు తినాలి అని పించింది.అందుకే పప్పు ఇంటికి తీసుకుని వెళ్లి చేయాలి తినాలి అనుకున్నాను." పరమాచార్య అన్నారు " ఇతనికి రోజూ గారెలు విసుగు పుట్టేదాకా తినిపించండి." భోగాలతో విసుగు చెందిన వాడు ఆఖరికి పరమయోగిగా మారుతాడు.వేమన నిదర్శనం.
ఆరోజుల్లో రామస్వామి నాయకర్ పరమనాస్తికుడు.దేవుడు పూజలు అంటే తిట్టిపోసిన దురహంకారి.ఓ తెల్ల రాతిస్థంభంపై‌ " గాడ్ ఈజ్ ఫూల్ ఇడియట్! ఇంకా కొలిచేవారు...అని " పిచ్చి తిట్లు చెక్కించి కంచి పీఠం ఎదురుగా ఆర్భాటంగా దాన్ని పాతిపెట్టడం అమానుషం.అది ఇప్పటికీ ఉంది.నడిచేదైవం ఓకే ఒక మాట అన్నారు "దేవుడు"
అనే పదాన్ని పదేపదే వాడి లేడు అంటున్నాడు.మనకేం నష్టం.కాలం నిర్ణయిస్తుంది."
అలాంటి కాంచీపురం పరమాచార్య తో పవిత్రం.
జయేంద్ర సరస్వతి స్వామి మన సంస్కృతిని బాగా ప్రచారం చేశారు.ప్రతిదీ చేసి చూపారు.నిజంగా ఇలాంటి వారిగురించి ఎన్నిసార్లు చదివినా విన్నా మనసు పులకరిస్తుంది కదూ? హమారా భారత్ మహాన్!

కామెంట్‌లు