ఒక స్వప్నం!!;-Dr.ప్రతొప్ కౌటిళ్యా
స్వప్నం వెంట నిదుర ప్రేమిస్తూ ప్రయాణిస్తుంటే
హృదయం గదులన్నీ మూసివేసింది.
మెలుకువ మెల్లిగా కనురెప్పల పరదాల్లో ఆదమరిచి ఉయ్యాలలూగుతుంది.!!

దిక్కరించిన స్వప్నం గర్భగుడిలో గుండె గంటలను మోగించింది.
ఎంతో అందమైన ఆ స్వప్నం
తలను రెండుగా చీల్చి గుండెను ఎడమ నుంచి కుడికి మార్చి
మౌనంగా గుండెలయల్లో మరో లోకాల్లోకి తీసుకెళ్తుంది.!!

అందమంతా కరగక మునుపే కన్యకల లోకాలన్నీ చుట్టి
కళ్ళు లేని మనసు మందిరంలో కళ్ళు తెరిచి చూసింది
రంగుల అంతఃపురం కాదది అంతరంగం.!!?

నటరాజు నాట్యంతో ముల్లోకాలు ఊగిపోతున్నాయి.
మూడో కన్ను తెరవక మునిపే అగ్నిపర్వతాలు మంచుకొండలై కరిగిపోతున్నవీ.
మంచు మేఘాల లోగిళ్లలో కలల కవల పిల్లలు అన్ని ఒకేలా కలిసిపోయి ఉన్నాయి.

నెలవంకలు కిందికి దిగి హిమగిరిల ద్వారాలకు తోరణాలై మెరుస్తున్నవి.

యుక్త వయసులోని స్వప్నాలు
సురాపాన మందిరంలో సహస్రక్షుని అందాలను వెక్కిరిస్తున్నవీ.
వృద్ధాప్యమే లేని లోకం స్వప్న సుందరులకు అమృతం తాపితే
నిదుర లేచి చూసి యుగాలనాటి కలలు పండినవని
జగమంతా వింత లోకమైందని నిజమైన కలలు అందమైన స్వప్నాల అవతారాలని అనుకుంది.!!

స్వప్నం విషం తాగిందని నిదుర బెదిరిపోయి గుండెను తట్టి లేపిం

కామెంట్‌లు