రాజ్యాంగ రూపశిల్పి- అంబేద్కర్;- దుగ్గి గాయత్రి,-టి.జి.టి.తెలుగు,-M.A,B.Ed,SET (Ph.D),కల్వకుర్తి.
 జయ జయహో అంబేద్కరా మా నీరాజనాలివే అందుకొనుమ  "2"
అస్పృశ్యుల పాలిట ఆరనిజ్యోతివి నీవె 
బహుజనుల జీవిత పథాన చుక్కానివి నీవె 
సమదృష్టితో లోకాన్ని చూడమన్న నవ భాస్కరునివి నీవె
                               //జయ//
అంటరానితనపు అణువణువును చీల్చేటి అరుణోదయమ్ము నీవె
మనిషి మనిషిగా చూడలేని మూఢులను
మట్టు బెట్ట మార్గదర్శివి నీవె
కార్మిక జనసంద్రానికి దశదిశలు చూపే క్రాంతిరథుడువు నీవె
                              //జయ//
వెలివాడల వెతలు బాపే మా బాపువు నీవె      
బడుగుల భాగ్యరేఖయైన భారత రాజ్యాంగ రూపశిల్పివి నీవె
జాతిని జాగృత పరిచిన జయభేరివి నీవె
                             // జయ// 
(ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా)
కామెంట్‌లు