శ్రీగురు వందనము;- కవిమిత్ర శంకర ప్రియ., శీల, సంచార వాణి:6 98127 67098

  🔆 శ్రీమదాది గురుమూర్తి
 శ్రీసదాశివుని నుండి
     గురురూపు లందరికి
  వందనమ్ము! గురుదేవ! (1)            
🔆భౌతిక విజ్ఞానమును
 ఆధ్యాత్మిక జ్ఞానమును
      బోధించు వారందరికి 
 వందనమ్ము! గురుదేవ! (2)
         (అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
 🔱సదాశివ సమారంభాం
 శంకరాచార్య మాధ్యమాం!
     అస్మదాచార్య పర్యంతాం
  వందే గురు పరంపరాం!
.....అని, శ్రీగురు ధ్యానముతో;  భక్త మహాశయు లందరు, దైనందిన కార్యక్రమములు ప్రారంభించు చున్నారు!
👌 ఆదిగురుదేవుడైన, సదాశివుని నుండి... "శ్రీగురు సంప్రదాయము" ఆరంభింప బడినది! హయగ్రీవుడు, అగస్త్యుడు, వేదవ్యాసుడు,  ఆదిశంకరుడు, రామానుజుడు... మున్నగు వారందరు "గురు పరంపర"ను కొనసాగించారు! వారు.. మన సనాతన ధర్మమును విశ్వవ్యాప్తం చేసారు! ఆ విధంగా మన " ఆర్ష ధర్మము"ను పరిపుష్టి కావించారు, జగద్గురువులందరు!
👌ఆదిశంకరులు అవతరించిన కాలంలో భరతవర్షము మిక్కిలి సంక్షోభం నెలకొని యున్నది! ఆ సమయంలో  సామాజిక, సాంస్కృతిక,  ధార్మిక పరిస్థితులలో ఒక ఆశాకిరణం...ఆచార్య ఆదిశంకరుల ఆగమనం! శ్రీస్వామివారు ...తన ముప్పది రెండు సంవత్సరాల అల్పవయస్సులో భారతదేశ మంతటా  ముమ్మారు పర్యటించారు! వైదిక ధర్మమును తిరిగి నెలకొల్పారు! "ఆధ్యాత్మిక కేంద్రం"గా భారతదేశమును  తీర్చిదిద్దారు, జగద్గురు శంకర భగవత్పాదుల వారు!
     🚩సీస పద్యము
శ్రీసదాశివునిచే శ్రీకార మందించు
   వేదోక్త మార్గంపు వెలుగు లివియె,
ప్రస్థాన త్రయముతో బ్రహ్మస్వరూపంబు
   మనకంత యందించె మమత తోడ,
సాత్యవతేయుండు సదయుడై మనకంత
   వేదోక్తధర్మాన్ని విశద పరిచె,
శంకరులంతట శంకరా చార్యులై
    కైలాసగిరి నుండీ కదిలి వచ్చె,
వేదోక్త ధర్మమే వేదాంత తత్త్వమే
   విశ్వాని కందించె  విపులరీతి,
శృంగేరి పీఠము శృతిసార భూమియై
    ఆమ్నాయ గమ్యమ్ము యవనికొసగె!
      [ రచన:- విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి.,]
🚩జయ జయ శంకర!
      హర హర శంకర;
కామెంట్‌లు